తెలుగు సినిమా ఇండస్ట్రీలో చిన్న సినిమాలుగా విడుదలై ఘన విజయాలు సాధించిన చిత్రాలు చాలా ఉన్నాయి. తాజాగా చిన్న సినిమాగా వచ్చిన ‘బేబీ’ బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయిలో కలెక్షన్లు సాధిస్తోంది.
3 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ.23.50 కోట్ల గ్రాస్ సాధించినట్లు చిత్ర యూనిట్ తెలిపింది. అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ సాధించినట్లు పేర్కొంది. నిన్న ఆదివారం కావడంతో రూ.10 కోట్ల వరకూ వసూలైనట్లు తెలుస్తోంది. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ కావడంతో పలుచోట్ల ఇంకా హౌస్ ఫుల్ బోర్డులు దర్శనమిస్తున్నాయి.