ఆర్థిక రంగంలో తెలంగాణ జోరు కొనసాగుతున్నది. వయసులో చిన్న రాష్ట్రమైనా, కేంద్రంలోని మోదీ సర్కారు అడ్డంకులు సృష్టిస్తున్నా సీఎం కేసీఆర్ నేతృత్వంలోని అభివృద్ధి, సంక్షేమం అనే జోడెద్దులతో పరిపాలన సాగిస్తూ అద్భుతాలను సృష్టిస్తున్నది.9 ఏండ్లలోనే రాబడిని మూడు రెట్లు పెంచుకుని అనేక పెద్ద రాష్ట్రలను వెనక్కి నెట్టింది. 2014 జూన్ 2న ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన తెలంగాణకు ఆ ఆర్థిక సంవత్సరంలోని చివరి 9 నెల ల్లో 63,323 కోట్ల రాబడి వచ్చింది.
ఆర్థిక రంగంలో తెలంగాణ జోరు కొనసాగుతున్నది. వయసులో చిన్న రాష్ట్రమైనా, కేంద్రంలోని మోదీ సర్కారు అడ్డంకులు సృష్టిస్తున్నా సీఎం కేసీఆర్ నేతృత్వంలోని అభివృద్ధి, సంక్షేమం అనే జోడెద్దులతో పరిపాలన సాగిస్తూ అద్భుతాలను సృష్టిస్తున్నది. 9 ఏండ్లలోనే రాబడిని మూడు రెట్లు పెంచుకుని అనేక పెద్ద రాష్ట్రలను వెనక్కి నెట్టింది. 2014 జూన్ 2న ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన తెలంగాణకు ఆ ఆర్థిక సంవత్సరంలోని చివరి 9 నెల ల్లో 63,323 కోట్ల రాబడి వచ్చింది. ఆ తర్వా త ఏటికేడు రాబడిని పెంచుకుంటూ వచ్చిన ప్రభుత్వానికి గత ఆర్థిక ఏడాది (2022-23)లో రూ.1,92,097 కోట్ల ఆదాయం వచ్చింది. 2023-24లో అదే జోరు కొనసాగిస్తున్న తెలంగాణకు తొలి రెండు నెలల్లోనే రూ.31,700 కోట్ల (ఏప్రిల్‌లో రూ.15,085 కోట్లు, మే నెలలో రూ.16,615 కోట్ల) రాబ డి వచ్చింది.
తొమ్మిదేండ్లలో 303.46% వృద్ధి
తెలంగాణ తొమ్మిదేండ్లలో 303.46% వృద్ధిరేటు సాధించింది. 2015-16లో రా ష్ర్టానికి మొత్తం రూ.1,11,974 కోట్ల రాబడి వస్తుందని బడ్జెట్‌లో అంచనా వేయగా.. తొలి 2నెలల్లో రూ.10,446 కోట్లు వచ్చింది. ఇది బడ్జెట్ అంచనాలో 9.33 శాతానికి సమానం. ఈ ఏడాది రూ.2,59,861 కోట్ల రాబడి వస్తుందని అంచనా వేయగా, తొలి రెండు నెలల్లో రూ.31,700 కోట్లు సమకూరాయి. ఇది నిరుడు ఇదే సమయంలో వచ్చిన రూ.20,238 కోట్ల రాబడి కంటే రూ.11,462 కోట్లు అధికం.
తెలంగాణపై కేంద్రం అక్కసు
దేశ ఆర్థిక రంగానికి వెన్నుదన్నుగా నిలుస్తున్న తెలంగాణకు కేంద్రంలోని మోదీ సర్కారు అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నది. అందులో భాగంగా ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితిలో భారీగా కోతలు విధించింది. 2022-23 ప్రారంభంలో తెలంగాణకు రూ.54 వేల కోట్ల ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితిని ప్రకటించిన కేంద్రం.. ఆ తర్వాత దాన్ని అకస్మాత్తుగా రూ.39 వేల కోట్లకు కుదించింది. ఫలితంగా రాష్ట్రానికి అందాల్సిన రుణాల్లో రూ.15 వేల కోట్లు తగ్గాయి. వాస్తవానికి ఆర్థికంగా పటిష్ఠంగా ఉన్న తెలంగాణ లాంటి రాష్ట్రాలు తమ ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి కంటే 0.5 శాతం అదనంగా రుణాలను సమీకరించుకునే వీలుంటుంది. కానీ, దీనికి కూడా కేంద్రం మోకాలడ్డటంతో రాష్ట్రం మరో రూ.6 వేల కోట్లు కోల్పోవాల్సి వచ్చింది. ఇది చాలదన్నట్టుగా తెలంగాణకు రావాల్సిన రూ.21 వేల కోట్ల బడ్జెటేతర నిధులకు మోదీ సర్కారు గండి కొట్టడంతో రాష్ట్రం మొత్తంగా రూ.40 వేల కోట్లు కోల్పోవాల్సి వచ్చింది. లేకుంటే ఆర్థికంగా తెలంగాణ మరెన్నో అద్భుతాలు సాధించేది.