పాలకుర్తి నియోజకవర్గంలో మిగిలి ఉన్న అభివృద్ది పనులను వేగవంతం చేసి పూర్తి చేయాలని రాష్ట్ర పంచాయితీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధికారులను, నాయకులని ఆదేశించారు.
పాలకుర్తి మంత్రి గారి క్యాంప్ కార్యాలయంలో పాలకుర్తి ప్రజాప్రతినిధులు, నాయకులు అధికారులతో పాలకుర్తి నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ది పనులపై మంత్రి ఎర్రబెల్లి సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ… తనను మూడు సార్లు గెలిపించిన ప్రజలకు రుణపడి ఉంటాను అన్నారు. సీఎం కెసిఆర్ గారి ఆశీస్సులతో, మంత్రి కేటీఆర్ గారి సహకారంతో నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నాను అన్నారు. మనం చేస్తున్న అభివృద్ధిని ప్రజలకు వివరించాలని అన్నారు.