పది మందికి మేలు చేయడం కోసం..పంట పొలాలను త్యాగం చేసిన మీ త్యాగాలు మరువలేమని మెదక్ పార్లమెంటు సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు..2వ టీఎంసీ కాలువ మూలంగా భూమిని కోల్పోతున్న మండలంలోని బండారు పల్లి, ఘనపుర్ రైతులకు సిద్దిపేట కలెక్టరేట్ లో కలెక్టర్ ప్రశాంత్ జీవన్ జీవన్ పాటిల్ తో కలిసి రూ.5లక్షల పరిహారం చెక్కులు పంపిణీ చేశారు..
ఈసందర్భంగా ఎంపీ గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో స్వయం సమృద్ధి సాధించడం జరిగిందన్నారు..కరువు కాలంలో సాగునీళ్లు అందిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టుల మీద ప్రతిపక్ష నాయకులు విమర్శలు చేయడం ..సూర్యుని మీద ఉమ్మేసినట్లే అవుతుందన్నారు..
తెలంగాణ మీద కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వివక్ష చూపిస్తుందని, తెలంగాణ లోని ఒక్క ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేదన్నారు..కేంద్రం నుండి తెలంగాణ ను నిధులు తీసుకు రావడంలో ఇక్కడి బీజేపీ ప్రజాప్రతినిధులు విఫలమయ్యారన్నారు..వీరికి గతంలోనే 2013 చట్టం ప్రకారం ఎకరాకు రూ.8 లక్షల చొప్పున ప్రభుత్వం అందించడం జరిగిందన్నారు.