తమిళస్టార్ హీరో విజయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. గ్రామాల్లో రాత్రిపూట స్కూళ్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ‘దళపతి విజయ్’ పేరుతో నైట్ స్కూల్స్ ఏర్పాటు చేయనున్నారు.
దీనికి సంబంధించి విజయ్ అభిమాన సంఘం ‘మక్కల్ ఇయకం’ జిల్లా అధ్యక్షులకు ఆదేశాలు అందాయి. రేపు తమిళనాడు వ్యాప్తంగా మాజీ సీఎం కామరాజ్ విగ్రహాలకు నివాళులు అర్పించాలని.. ప్రభుత్వ పాఠశాలల్లో నోట్ బుక్స్ పంపిణీ చేయాలని ఆదేశాల్లో పేర్కొన్నారు.