ఏపీ ముఖ్యమంత్రి.. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఈ నెల 21న చిత్తూరు జిల్లా కే వెంకటగిరికి వెళ్లనున్నారు. ఈ పర్యటనలో భాగంగా నాలుగో విడత నేతన్న నేస్తం పథకాన్ని ప్రారంభించి లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు.
అలాగే అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగసభలో పాల్గొని లబ్ధిదారులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. సీఎం పర్యటన ఖరారు కావడంతో సభ నిర్వహణ ఏర్పాట్లపై.. జిల్లా ఉన్నతాధికారులు, స్థానిక మంత్రులు, వైసీపీ నేతలు దృష్టి సారించారు.