కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని బహదూర్ పల్లి 15వ వార్డు శ్రీరామ్ నగర్ కాలనీకి చెందిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త సదానందం (38) ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు.
కాగా బీఆర్‌ఎస్ సభ్యత్వం పొంది ఉండడంతో పార్టీ నుంచి మంజూరైన రూ.2 లక్షల ప్రమాద బీమా చెక్కును ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు అతని నివాసానికి వెళ్లి స్థానిక కౌన్సిలర్ భరత్ గారితో కలిసి కుటుంబ సభ్యులకు అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ కార్యకర్తలకు అండగా ఉండి వారి కుటుంబాలకు భరోసా కల్పించే ఏకైక పార్టీ బీఆర్‌ఎస్ అని అన్నారు. బీఆర్‌ఎస్ సభ్యత్వం పొందిన ప్రతి వ్యక్తి కుటుంబానికి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అండగా నిలిచారన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.