తెలంగాణ వ్యాప్తంగా ఉన్న వృద్ధులైన వేద పండితులకు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం తీపికబురు అందించింది. వారికి ప్రతి నెలా ఇస్తున్న రూ.2500 గౌరవ భృతిని పెంచుతూ తాజాగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఇకనుంచి వారికి నెలకు రూ.5000 అందనున్నాయి. అంతేకాదు భృతి పొందే వేద పండితుల వయసును 75 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు తగ్గించింది. దీంతోపాటు వేద పాఠశాలల నిర్వహణకు ప్రతి ఏటా రూ. 2లక్షల ం అందించేందుకు అనుమతించింది