కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కొంపల్లి 8వ వార్డు ప్రోడెన్షియల్ బ్యాంక్ కాలనీ నూతన సంక్షేమ సంఘం ఎన్నికైన సందర్భంగా ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారిని పేట్ బషీరాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కమిటీ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు నూతన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. సభ్యులంతా ఐకమత్యంగా ఉంటూ కాలనీ అభివృద్ధికి కృషి చేయాలన్నారు.
కాగా కాలనీలో పార్క్ అభివృద్ధి, సీసీ రోడ్లు, డ్రైనేజీ వంటి సమస్యలను ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకురాగా.. వెంటనే స్పందించి స్థానిక కమిషనర్ తో ఎమ్మెల్యే గారు ఫోన్ లో మాట్లాడి అందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కాలనీ ప్రెసిడెంట్ సుంకరి కృష్ణ మరియు అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.