సత్తుపల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా సమావేశం నియోజకవర్గ కేంద్రంలోని లక్ష్మీ ప్రసన్న ఫంక్షన్ హాల్ లో ఘనంగా జరిగింది.. స్థానిక ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య గారి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా రాష్ట్ర కన్వీనర్,ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇంచార్జ్ దినేష్ చౌదరి గారు,ఉమ్మడి ఖమ్మం జిల్లా యువజన విభాగ అధ్యక్షుడు చింతనిప్పు కృష్ణచైతన్య గారు హజరయ్యారు.. ఈ సందర్భంగా దినేష్ చౌదరి గారు మాట్లాడుతూ తెలంగాణలో ఎన్నికల సమయం దగ్గర పడేకొద్ది ప్రజల్లో లేనివాళ్లు..ఎన్నికలంటే వచ్చేవాళ్లు ఇప్పుడు వస్తున్నారు..
రాజకీయం అందరూ చేస్కోవచ్చు కానీ గత పదేండ్లుగా కన్పించని వాళ్లు..ప్రజలకు దూరంగా ఉన్నవాళ్లు ఇప్పుడు వచ్చి అసత్య ప్రచారాలకు దిగుతున్నారు.. ఈ ప్రచారం సోషల్ మీడియా వేదికగా విసృతంగా జరుగుతున్న నేపథ్యంలో ఆ ప్రచారాన్ని తిప్పుకొట్టాలి..సోషల్ మీడియా వారీయర్స్ అందరూ నిత్యం బీఆర్ఎస్ పార్టీ,సీఎం కేసీఆర్ ,మంత్రి కేటీఆర్ గార్ల అధికారక సోషల్ మీడియా ఖాతాలతో పాటు,ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య గారి యొక్క సోషల్ మీడియా ఖాతాలను అనుసరించాలి..నిత్యం ప్రజల్లోకి వాటిని తీసుకెళ్లాలి.. పదేండ్లుగాబీఆర్ఎస్ ప్రభుత్వం,ఎమ్మెల్యే సండ్ర గారు జేసిన అభివృద్ధి పథకాల గురించి ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రతిపక్షాల అసత్య ప్రచారాలను తిప్పికోట్టాలని సూచించారు.
సోషల్ మీడియాలో పని చేసే తీరు,ప్రతిపక్షాలను ఎలా ఎదుర్కోవాలో సూచించారు.. మరోవైపు యువజన విభాగ అధ్యక్షుడు కృష్ణ చైతన్య గారు మాట్లాడుతూ తెలంగాణలో ఖమ్మం జిల్లా అభివృద్ధిలో మిగతా జిల్లాలకు ఆదర్శంగా నిలిచింది. జిల్లాలో సత్తుపల్లి నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకెళ్తుంది. నియోజకవర్గంలో యువత అంత బీఆర్ఎస్ ప్రభుత్వం వైపు ఉంది. బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి నియోజకవర్గంలో ప్రతి గడపకు వాట్సాప్ ఫేస్ బుక్ ఇన్ స్టా వేదికల ద్వారా తీసుకెళ్లి ప్రచారం చేయాలని సూచించారు..ఎన్నికలు వస్తున్న తరుణంలో మాయమాటలతో ప్రతిపక్షాలు బయలు దేరుతాయని..మీముందుకు వచ్చి కల్లబొల్లి మాటలతో మోసం చేయాలని చూస్తారు.. వాళ్ల మాయ మాటలను నమ్మి మోసపోవద్దు అని కృష్ణ చైతన్య సూచించారు..