అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రం ఫిలడెల్ఫియా లో గల పెన్సిల్వేనియా కాన్ఫరెన్స్ హాలులో జరిగిన తానా సభలకు హాజరై, 10 రోజుల అమెరికా పర్యటనను విజయవంతంగా ముగించుకొని, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు ఈ తెల్లవారుజామున 5 గంటలకు హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ విమానాశ్రయానికి చేరుకున్నారు.
ఈ సనర్భంగా మంత్రి కి ఉపాధి హామీ ఉద్యోగుల సంఘం జేఏసీ, ఆయన అభిమానులు, సిబ్బంది ఘనంగా స్వాగతం పలికారు. పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం మంత్రి అక్కడి నుండి నేరుగా యాదగిరి గుట్టకు వెళ్ళారు. యాదాద్రి లో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనం అనంతరం మంత్రి హైదరాబాద్ కు చేరుకుంటారు. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో సచివాలయంలో ఉపాధి హామీ పథకం పనులపై ఉన్నతాధికారులతో సమీక్ష చేస్తారు.