దేశ రాజధాని మహానగరం ఢిల్లీలో యమునా నది అత్యంత ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది.కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో వరద నీళ్లు ఢిల్లీ సీఎం.. ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ఇంటికి సమీపంలోకి వచ్చేశాయి.
ఢిల్లీ అసెంబ్లీకి ఐదోందల మీటర్ల దూరం నుండి ఈ వరద నీళ్లు ప్రవహిస్తోన్నాయి. కశ్మీరీ గేట్ – మంజుకా తిలానీని కలిపే ప్రాంతంలో యమునా నది నీరు చేరి వాహనదారులను ఇబ్బంది పెడుతుంది.
దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు ఈ రోజు మధ్యాహ్నానికి హర్యానాలోని హత్నీకుండ్ ప్రాజెక్టు నుండి నీటిని వదిలే అవకాశం ఉండటంతో వరద ఉద్ధృతి మరింత పెరిగే అవకాశం ఉంది.