వి.ఆర్.ఏ లకు పే స్కేల్ ప్రకటించిన సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మరియు శాసనసభ్యులు చెన్నమనేని రమేష్ బాబు గారికి నేడు వేములవాడలో కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసిన అర్బన్, రూరల్ మండలాల వి.ఆర్.ఏలు!
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేయాలనేదే ముఖ్యమంత్రి కేసీఆర్ గారి అభిమతం అని అన్నారు. రాష్ట్రం ఏర్పడిన అప్పటినుండి అన్ని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారని ఈ సందర్భంగా వి.ఆర్.ఏ లకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని అన్నారు. అనంతరం కేక్ కట్ చేసి ధన్యవాదాలు తెలియజేసారు.
ఈ కార్యక్రమంలో అర్బన్, రూరల్ మండలాల ఎం.ఆర్.ఓ లు నక్క శ్రీనివాస్ గారు, రాజిరెడ్డి గారు, ప్రజా ప్రతినిధులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.