ఏపీ ట్రిపుల్ ఐటీ ఫలితాలను మంత్రి బోత్స సత్యనారాయణ విడుదల చేశారు. ఈ ఫలితాల్లో అర్హులైన వారి జాబితాను ఈ సందర్భంగా మంత్రి బోత్స సత్యనారాయణ వెల్లడించారు.
ఈ నెల ఇరవై తారీఖు నుండి ఇరవై ఐదు తారీఖు వరకు కౌన్సిలింగ్ ఉంటుందని మంత్రి తెలిపారు. ఆరేండ్ల పాటు ట్రిపుల్ ఐటీ కి నాలుగు వేల నాలుగోందల సీట్లు ఉన్నాయి అని మంత్రి పేర్కొన్నారు.
రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులకు ఐఐటీ స్థాయి విద్యనందించాలనే లక్ష్యంతో వైఎస్సార్ ఆర్జీయూకేటీలను ప్రారంభించామని ఆయన ఉద్ఘాటించారు.