మూడు వేవ్ లుగా వచ్చి ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారి మిగిలిచ్చిన విషాదాన్ని మరిచిపోయి ఇప్పుడిప్పుడే గాడిన పడుతున్న తరుణంలో మరో సరికొత్త వైరస్ వెలుగులోకి వచ్చింది.
దక్షిణ అమెరికాలోని చిలీ దేశాన్ని ఓ వింత వైరస్ గజగజ వణికిస్తోంది.గిలాన్ బరే అనే అరుదైన సిండ్రోమ్ వ్యాధి వ్యాప్తితో అక్కడ ఎమర్జెన్సీ ప్రకటించారు. ఈ వైరస్ శరీరంలోని ఇమ్యూనిటీ వ్యవస్థపై దాడి చేస్తుంది.
దీంతో నరాలు,కండరాల వ్యవస్థ నిర్వీర్యం చేస్తుంది. దీంతో కండరాల బలహీనత,మొద్దుబారడం ,తిమ్మిర్లు వంటి అనారోగ్య లక్షణాలు కన్పిస్తాయి. అయితే ఇది ముందు కాళ్ల భాగంలో మొదలై శరీరమంతా వ్యాప్తిస్తుంది. నరాల పరీక్ష ద్వారా ఈ వైరస్ ను గుర్తించవచ్చు అని అక్కడ వైద్యులు చెబుతున్నారు.