కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారి క్యాంపు కార్యాలయంలో సోమవారం అన్ని విభాగాల అధికారులతో సేవరేజ్ పైప్ లైన్ నిర్మాణం కొరకు సమీక్ష సమావేశం నిర్వహించారు..
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ ఇప్పటికే అన్ని ప్రాంతాల్లో పైప్లైన్ నిర్మాణం కొరకు ఎక్కడికి అక్కడ పైపులు సిద్ధం చేశామని ఇందులో వాటర్ వర్క్స్ మరియు జిహెచ్ఎంసి ,ఎలక్ట్రిసిటీ అందరూ సమన్వయం చేసుకుని పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు…
భవిష్యత్తు ప్రణాళికలు దృష్ట్యా ముఖ్యమంత్రి కేసీఆర్ ,మంత్రి కేటీఆర్ పటిష్ట చర్యలు తీసుకుంటున్నారని ..ఇందులో భాగంగానే పైప్ లైన్ల నిర్మాణం కొరకు నిధులకు ఎక్కడా వెనుకాడకుండా కేటాయిస్తున్నారని ..ఈ సందర్భంగా గుర్తు చేశారు… అలాగే ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాల విషయంలో అధికారులందరూ వారికి అందుబాటులో ఉండి ఎక్కడైనా సమస్యలు ఉన్న ఎడల పరిష్కరించాలని ఆదేశించారు.. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కార్పొరేటర్లు.. అన్ని విభాగాల అధికారులు పాల్గొన్నారు…