ప్రస్తుత సెల్ ఫోన్ ప్రపంచం లో యువత లో కొరవడిన క్రీడా స్ఫూర్తి ని తిరిగి నింపడానికి సూర్యాపేట శాసన సభ్యులు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి గారు నియోజకవర్గ వ్యాప్తంగా తలపెట్టిన జగదీషన్న కప్ క్రీడా సంబురాలు అట్టహాసంగా పండుగ వాతావరణం లో కొనసాగుతున్నాయి.. ఇప్పటికే గ్రామ స్థాయిలో క్రీడలు పూర్తి అవగా, రెండు రోజులుగా సూర్యాపేట పట్టణంలోని 48 వార్డులలో పోటాపోటీగా సాగుతున్నాయి.
యువతతో పోటీపడి మహిళలు సైతం క్రీడామైదానంలో దిగి పలు క్రీడల్లో సత్తా చాటుతున్నారు. మంత్రి జగదీశ్ రెడ్డి తనయుడు వేమన్ రెడ్డి స్వయంగా వార్డు వార్డ్ న తిరుగుతూ క్రీడలను పర్యవేక్షిస్తున్నారు. అక్కడక్కడ యువత, మహిళల తో కలిసి క్రికెట్, చెస్ ,వాలీబాల్, కోలాటం వంటి పోటీలలో పాల్గొని క్రీడాకారులను ఉత్సాహ పరుస్తున్నారు.
ఈ సందర్భంగా వేమన్ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో తన లాంటి యువత, మహిళలలో కొరవడిన క్రీడా స్ఫూర్తిని తిరిగి నింపడానికి తన తండ్రి జగదీశ్ రెడ్డి గారు శ్రీకారం చుట్టిన క్రీడా పోటీలకు పెద్ద ఎత్తున స్పందన లభిస్తుందన్నారు. యువతతో పోటీపడి మహిళలు కూడా క్రీడలలో పాల్గొనడం ఆహ్వానించదగ్గ విషయం అన్నారు.క్రీడలు ప్రజల్లో సమైక్యతా భావాన్ని పెంచుతాయని అన్నారు. క్రీడల ద్వారా జీవితంలో గెలవాలనే తపన, ఏదైనా సాధించగలం అనేనమ్మకం, ఆత్మవిశ్వాసం పెరుగుతుందని వేమన్ రెడ్డి అన్నారు.