తెలంగాణ రాష్ట్రంలో రైతు చనిపోతే ఆ రైతుకుటుంబం రోడ్డున పడకూడదని ముఖ్యమంత్రి కేసీఆర్ మదిలో మెదిలిన ఆలోచన కార్యాచరణే రైతు బీమా పథకం.
ఈ పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా చనిపోయిన రైతు కుటుంబానికి వారం రోజుల్లోనే ఐదు లక్షల రూపాయల బీమా సాయాన్ని అందిస్తుంది బీఆర్ఎస్ ప్రభుత్వం.
తాజాగా రైతుబీమాపై ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం ఓ శుభవార్తను తెలిపింది. ఇందులో భాగంగా జూన్ నెల పద్దెనిమిది తారీఖు వరకు కొత్త పట్టా పాసు పుస్తకాలను పొందిన లబ్ధిదారులు ఈ పథకానికి అర్హులని ప్రకటించింది.
దీంతో కొత్తగా అర్హులైన రైతులందరూ కొత్త పట్టా పాసు పుస్తకం, ఆధార్ కార్డు జీరాక్స్, బ్యాంకు ఖాతా జీరాక్స్ లతో స్థానిక ఏవో అధికారుల వద్ద రైతుబీమా గురించి తమ వివరాలను నమోదు చేసుకోవాలని సూచించింది.