జనసేన పార్టీ అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ ఏలూరులో నిన్న ఆదివారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళలు అదృశ్యమవుతున్నారని, ఇందుకు వలంటీర్లే కారణమన్నారు. అధికార వైసీపీ పాలనలో 30వేల మందిలో 14 మంది ఆచూకీ ఇప్పటికీ తెలియలేదంటూ సంచనల వ్యాఖ్యలు చేశారు.
వైసీపీలో పాలనలో ప్రతి గ్రామంలో వలంటీర్లతో కుటుంబంలో ఎంత మంది ఉన్నారు? వారిలో మహిళలు ఎందరు? వితంతువులున్నారా? అని ఆరా తీస్తున్నారని, ప్రధానంగా ఒంటరి మహిళలే లక్ష్యంగా సమాచారం సేకరించి సంఘ విద్రోహ శక్తులకు ఇస్తున్నారు’ అంటూ వ్యాఖ్యానించారు.దీంతో పవన్ కళ్యాణ్ కు ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ సోమవారం నోటీసులు జారీ చేసింది.
ఏపీలో మహిళలు కనిపించకుండా అదృశ్యహవుతున్నారంటూ పవన్ చేసిన వ్యాఖ్యలపై మహిళా కమిషన్ స్పందిస్తూ జారీ చేసింది. పది రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. లేని పక్షంలో క్షమాపణలు చెప్పాలని స్పష్టం చేసింది. మహిళల అదృశ్యంపై ఏ కేంద్ర నిఘా వ్యవస్థ చెప్పిందో సమాచారం ఇవ్వాలని పవన్‌ను కోరింది. అలాగే, ఆ మహిళల వివరాలు ఇవ్వాలని మహిళా కమిషన్ నోటీసుల్లో పేర్కొంది. వివరాలు తెలిపిన కేంద్ర అధికారి ఎవరో చెప్పాలని మహిళా కమిషన్ స్పష్టం చేసింది.