దాదాపు రెండేళ్ల పడిన కష్టం బూడిదలో పోసిన పన్నీరైంది లైగర్’ ఫలితం విజయ్ దేవరకొండది.. దీంతో తాజాగా రౌడీ ఫెలో విజయ్ ఆశలన్నీ ‘ఖుషీ’ సినిమాపైనే ఉన్నాయి. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుంది.
ఇప్పటికే రిలీజైన పోస్టర్‌లు సినిమాపై కాస్త మంచి అటెన్షన్‌నే క్రియేట్ చేశాయి. రోమ్-కామ్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా సెప్టెంబర్‌లో రిలీజ్ కానుంది. ఈ క్రమంలో మేకర్స్ ఇప్పటి నుంచే బ్యాక్ టు బ్యాక్ అప్‌డేట్‌లు ప్రకటిస్తూ సినిమాపై అంచనాలు నెలకొల్పుతున్నారు.
తాజాగా ఖుషీ సెకండ్ సింగిల్ ప్రోమోను చిత్రబృందం రిలీజ్ చేసింది. ఆరాధ్య అంటూ సిద్ శ్రీ రామ్ గాత్రం వింటుంటే ఊహల్లో తేలిపోతున్నట్లు అనిపిస్తుంది. సిద్ శ్రీ రామ్ ఆలిపించిన ఈ పాటకు శివ నిర్వాణ సాహిత్యం అందించాడు.
ఈ పాట ఫుల్ సాంగ్ జూన్ 12న రిలీజ్ కానుంది. ఇప్పటికే రిలీజైన నా రోజా నువ్వే సాంగ్ ఇన్‌స్టాంట్‌గా ఎక్కేసింది. రీల్స్, షార్ట్స్‌లతో సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేసింది. ఇక ఇప్పుడు ఈ సినిమా సెకండ్ సింగిల్ కూడా అదే రేంజ్‌లో ఉంటుందని చిత్రయూనిట్ వెల్లడించింది.