మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచేవి బోనాల పండుగ పురస్కరించుకుని ప్రజలంతా ఆయురారోగ్యలతో ఆనందంగా ఉండాలని తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ, ఆడపచులందరికీ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతే బోనాల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయని, రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర పండుగగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రకటించారని పేర్కొన్నారు.
2014 నుండి బోనాల ఉత్సవాలకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తూ, బోనాలను ఘనంగా నిర్వహించుకోవాలి అనే ఉద్దేశం తోనే దేవాలయాలకు ఆర్ధిక సహాయం అందిస్తూ మన సంప్రదాయాలకు కేసీఅర్ గారు సముచిత గౌరవం కల్పించారన్నారు.