కృష్ణారెడ్డికి మెరుగైన వైద్యం అందించాలని తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి వైద్యులను ఆదేశించారు. శుక్రవారం రాత్రి ఆత్మకూరు మండలం బొప్పారం గ్రామానికి చెందిన పగడాల కృష్ణారెడ్డి రోడ్డు ప్రమాదంలో గాయాల పాలై సూర్యాపేట మెడికల్ కళాశాల జనరల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న మంత్రి హుటహుటీన ఆసుపత్రికి వెళ్లి కృష్ణారెడ్డి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. తలకు తీవ్రమైన గాయం కావడంతో నిమ్స్ ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. స్వయంగా దగ్గరుండి అంబులెన్స్ లో కృష్ణారెడ్డి ని హైదరాబాద్ తరలించి కుటుంబ సభ్యులకు దైర్యం చెప్పారు
