కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రగతినగర్ లో క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అల్లూరి సీతారామరాజు గారి 126వ జయంతి ఉత్సవాల్లో ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని స్థానిక మేయర్ కొలన్ నీలా గోపాల్ రెడ్డి గారితో కలిసి ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ దేశ స్వాతంత్య్రం కోసం, స్వయం పాలన కోసం తన ప్రాణాలను పణంగా పెట్టి బ్రిటిష్ పాలకులతో పోరాడిన అల్లూరి సీతారామరాజు గారి త్యాగం గొప్పదని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో ఫ్లోర్ లీడర్ ఆగం పాండు, కార్పొరేటర్లు, నిజాంపేట్ అధ్యక్షుడు రంగరాయ ప్రసాద్, సీనియర్ నాయకులు గోపాల్ రెడ్డి, సుధీర్ రెడ్డి, క్షత్రియ సేవా సమితి సభ్యులు, నాయకులు పాల్గొన్నారు.