కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని వివిధ అభివృద్ధి పనులపై మంత్రి శ్రీ కేటీఆర్ ని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు హైదరాబాద్ లోని వారి కార్యాలయం వద్ద మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా దూలపల్లి బ్రిడ్జి, ఫాక్స్ సాగర్ నాలా, కోల్ నాలా, హెచ్.ఎం.డబ్ల్యు.ఎస్.ఎస్.బీ అభివృద్ధి పనులు, లింకు రోడ్లు, కుత్బుల్లాపూర్ జిహెచ్ఎంసిలోని ఎనిమిది డివిజన్ లలో రోడ్లు, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఎస్.ఎన్.డి.పి తదితర అభివృద్ధి పనులపై మంత్రి కేటీఆర్ గారితో ఎమ్మెల్యే గారు చర్చించి.. ఆయా పనులు సకాలంలో పూర్తి చేసేలా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని మంత్రి గారిని ఎమ్మెల్యే గారు కోరారు.
సానుకూలంగా స్పందించిన మంత్రి కేటీఆర్ గారు ఆయా ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎమ్మెల్యే గారి విజ్ఞప్తి మేరకు ప్రజలకు ఇబ్బందులు లేకుండా పనులు సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు.