హైదరాబాద్ మెట్రో చరిత్ర సృష్టించింది. సోమవారం ఒక్కరోజే మెట్రోలో 5.10 లక్షల మంది ప్రయాణించారు. ఒక్కరోజులో ఈ స్థాయిలో ప్రయాణించడం ఇదే తొలిసారి కాగా.. నాగోల్ నుంచి హైటెక్ సిటీ, ఎల్బీనగర్ నుంచి కూకట్ పల్లి రూట్లో భారీ సంఖ్యలో ప్రయాణించారు.
అమీర్ పేట్, ఉప్పల్, ఎల్బీనగర్ స్టేషన్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. 2017లో ప్రారంభమైన హైదరాబాద్ మెట్రోలో.. ఇప్పటివరకు 40 కోట్ల మంది ప్రయాణించారు.