Home / SLIDER / గిరిజనులకు పోడు పట్టాలు పంపిణీ

గిరిజనులకు పోడు పట్టాలు పంపిణీ

దశాబ్దాలుగా గిరిజనులు చదును చేసిన పోడు భూములను సాగు భూములుగా మార్చి యాజమాన్య హక్కు కల్పిస్తూ పొడు పట్టాలను పంపిణీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అన్నారు. సత్తుపల్లిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మండలంలోని బుగ్గపాడు, చెరుకుపల్లి, కాకర్లపల్లి, రేగళ్ళపాడు, రుద్రాక్షపల్లి గ్రామాలకు చెందిన 1,196 మంది రైతులకు 1,649 ఎకరాలకు పోడు పట్టాలను గిరిజనులకు ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య గారు , జిల్లా కలెక్టరు గౌతమ్ గారు, భద్రాచలం ఐ.టి.డి.ఏ ప్రాజెక్టు అధికారి పోట్రు గౌతమ్ గారు , D.F.O సిద్దార్ధ్ విక్రమ్ సింగ్ గార్లతో కలసి పంపిణి చేసారు.

తెలంగాణ రాష్ట్రం అవిర్భవించి 9 సంవత్సరాల పాలనలో ముఖ్యమంత్రి కెసిఆర్ గారి సారధ్యంలో ఎన్నో అభివృద్ది, సంక్షేమ పథకాలను అమలు చేసిందని ఎమ్మెల్యే సండ్ర అన్నారు. గిరిజనులకు ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ పోడు భూములను సాగు చేసుకున్న అర్హులైన గిరిజనులకు పట్టాలు అందించడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 1 లక్షల 51 వేల 146 మంది పోడు రైతులకు పట్టాలు అందించడం జరుగుతుందని తెలిపారు. 2006 ఆటవీ హక్కుల చట్టం ప్రకారం 2005 డిసెంబర్ 13 కు ముందు వరకు సాగు చేస్తున్న వారిని అర్హులుగా గుర్తిస్తూ పోడు పట్టాలను అందించడంతో పాటు పట్టాలు అందుకున్న వారందరికి ఈ వానాకాలం నుండే రైతుబంధును అందించడం జరుగుతుందని అన్నారు.

రాష్ట్రంలో బంజారాల, అదివాసుల అత్మగౌరవాన్ని సమున్నతంగా చాటే విధంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో అత్యంత ఖరీదైన స్థలాన్ని కేటాయించి 50 కోట్ల రూపాయలతతో సంత్ సేవాలాల్ బంజార భవన్, కుమ్రంభీం ఆదివాసి భవన్‌గా నిర్మించడం జరిగిందని తెలిపారు. గిరిజనుల పండుగలను అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నామని, 350 కోట్ల రూపాయలను ఖర్చు చేసి మేడారంలో మౌళిక సదుపాయాలు కల్పించడం జరిగిందని తెలిపారు. అడవిబిడ్డల సంక్షేమమం దిశగా తెలంగాణ ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుందని అన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat