కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, గాజులరామారం 125 డివిజన్ లో “ప్రగతి యాత్ర”లో భాగంగా 81వ రోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు పర్యటించారు. ఈ సందర్భంగా ద్వారక నగర్, చెన్నకేశవ నగర్, మల్లారెడ్డి నగర్ ఫేస్-1 కాలనీలలో పాదయాత్ర చేస్తూ పూర్తి చేసిన అభివృద్ధి పనులను పరిశీలించి మిగిలి ఉన్న పనులను తెలుసుకున్నారు.
కాగా రూ.3.25 కోట్లతో కాలనీల్లో మెరుగైన వసతుల కల్పనకు కృషి చేసినందుకు ప్రజలు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే గారికి ఘన స్వాగతం పలికారు. శాలువాలతో ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ద్వారక నగర్ లో మిగిలి ఉన్న సీసీ రోడ్లు, మల్లారెడ్డి నగర్ ఫేస్-1, చెన్న కేశవనగర్ లలో నూతన ట్రాన్స్ఫార్మర్ లు, మంచినీటి సరఫరాలో అంతరాయం లేకుండా చర్యలు, సెంటర్ మీడియన్ వెడల్పు తగ్గించాలని, పాత భూగర్భడ్రైనేజీని పెంచాలని ఎమ్మెల్యే గారిని కోరగా.. అక్కడే ఉన్న సంబంధిత అధికారులకు ఎమ్మెల్యే గారు ఆదేశాలు ఇచ్చారు.
వాటిని త్వరలోనే పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఈఈ గోవర్ధన్, డిఈఈ రూపాదేవి, డిజిఎం అప్పల నాయుడు, మేనేజర్ రోహిణి మరియు స్థానిక డివిజన్ బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కాలనీల సంక్షేమ సంఘాల అధ్యక్ష, కార్యదర్శులు, కాలనీల ప్రజలు తదితరులు పాల్గొన్నారు.