సూర్యాపేట జిల్లా ఆత్మకూరు యస్ మండలం ఏనుబాముల గ్రామ నివాసి తండు మహేష్ గౌడ్ s/o అంజయ్య అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
చికిత్స కోసం ఆర్థికంగా ఇబ్బంది పడుతుండడంతో మంత్రివర్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి దృష్టికి సమస్యను తీసుకెళ్లగా వెంటనే స్పందించిన మంత్రి గారు 2,00,000 ,(రెండు లక్షలా రూపాయలు ) లను సీఎం రిలీఫ్ ఫండ్ (LOC) ద్వారా మంజూరు చేయించి వారి కుటుంబానికి అండగా నిలిచారు.
ఈ సందర్భంగా T. మహేష్ కుటుంబ సభ్యులు మాట్లాడుతూ ప్రజల కష్టాల్లో సుఖాల్లో పాలుపంచుకునే నాయకుడు దొరకడం మన అదృష్టం అని చెప్పారు.మాకు ఏ బాధ వచ్చినా ఏ కష్టం వచ్చిన నేను ఉన్న అనే ధైర్యం ఇచ్చిన మంత్రి జగదీష్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.