అశ్వారావుపేట(నియోజకవర్గం), ములకలపల్లి(మండలం)లోని రాచన్నపేట(191) , ముత్యాలంపాడు(89), సితాయిగూడెం(320), జగన్నాథపురం(360), పాతగంగారం(135)లో 1095 గిరిజన పోడు రైతులకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇచ్చిన హామీ మేరకు ఏర్పాటు చేసిన పోడు భూమి పాస్ పుస్తకాలను అశ్వారావుపేట MLA మెచ్చా నాగేశ్వరరావు గారు పంపిణీ చేశారు.
ప్రతి ఒకరు ఎంతో ఆనందంగా వారి పాస్ పుస్తకాలు తీసుకుంటూ ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన అడవి బిడ్డలకు ఇచ్చిన హామీ ప్రకారం పోడు భూములకు పాస్ పుస్తకాలు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏర్పాటు చేశారని. కాగితాలు పట్టుకొని కాళ్లరిగేలా కార్యాలయాల చుట్టూ తిరిగే పని లేకుండానే సీఎం కేసీఆరే గారు మనందరి బంధువులా పోడు రైతుల ఖాతాల్లోకి రైతు బంధునీ కూడా వేసేసారనీ,ఇటు పోడు పట్టాలు.. అటు రైతుబంధు డబ్బులు ఖాతాల్లోకి ఇంతకంటే మంచి చెసే ప్రభుత్వం మరేది లేదని కొందరు వస్తుంటారు పోతుంటారనీ కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాత్రం ఇక్కడే ఉంటారని మన మీద అమితమైన ప్రేమ ఒక్క ముఖ్యమంత్రి కేసీఆర్ గారికే ఉందని ఆయనను మనం జీవితాంతం మర్చిపోకూడదని కోయ బాషలో మాట్లాడుతూ అన్నారు…
ఈ కార్యక్రమంలో ఎంపీపీ,మండల BRS పార్టీ అధ్యక్షులు,వైస్ ఎంపీపీ,ఎంపీటీసీ లు,సర్పంచ్ లు,ఉప సర్పంచ్ లు,మండల నాయకులు,గ్రామ BRS పార్టీ అధ్యక్ష కార్యదర్శులు,నాయకులు,యువ నాయకులు, కార్యకర్తలు,అధికారులు పాల్గొన్నారు.