తన పుట్టిన రోజు సందర్భంగా తన పై రూపొందించిన ప్రత్యేక పాటను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, హైదరాబాద్ లోని మంత్రుల నివాసంలో ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ తనపై అభిమానంతో రూపొందించిన ఆ పాట అద్భుతంగా వచ్చిందని వారి అభిమానానికి సర్వదా కృతజ్ఞతతో ఉంటానని తెలిపారు.
ప్రజా జీవితంలో ప్రజాసేవకే అంకితం పనిచేస్తున్నాను అని అన్నారు. బి అర్ ఎస్ యువ నాయకుడు, దయన్న వీరాభిమాని పాలకుర్తి నియోజకవర్గం రాయపర్తి మండలం బురహాన్ పల్లి గ్రామానికి చెందిన కడుదూరి రత్నాకర్ రెడ్డి రూపొందించిన “కారణ జన్ముడు దయన్న” అనే పాట ను 67 వ జన్మదినోత్సవం ను పురస్కరించుకొని, దయన్న చేతుల మీదుగానే ఆవిష్కరింప చేశారు.
సాయి సంగీత సారథ్యంలో తొర్రూరు సంపత్ రాసిన ఈ పాటను, భీమ్లా నాయక్ పాట పాడిన అరుణ్ కౌండిన్య పాడారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు యువ నేతలు యువకులు పాల్గొన్నారు.