పాలకుర్తి నియోజకవర్గం పెద్ద వంగర మండలం కాన్వాయ గూడెం గ్రామానికి అవసరమైన అంతర్గత సిసి రోడ్లు డ్రైనేజీలు వివిధ మౌలిక సదుపాయాల కల్పనకు అవసరమైన నిధులు మంజూరు చేస్తున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు.
ఆదివారం ఉదయం ఆ గ్రామానికి చెందిన పలువురు ప్రముఖులు పార్టీ నేతలు ప్రజాప్రతినిధులు అంతా కలిసి హైదరాబాదులోని మంత్రుల నివాసంలో మంత్రి ఎర్రబెల్లిని కలిశారు.
ఈ సందర్భంగా వారు తమ గ్రామానికి అవసరమైన వివిధ అభివృద్ధి పనులపై మంత్రికి వివరించారు. దీంతో మంత్రి వెంటనే స్పందించి ఆయా పనులను మంజూరు చేస్తున్నట్లు త్వరలోనే ఆ పనులకు శంకుస్థాపనలు చేసి ప్రారంభించనున్నట్లు చెప్పారు. దీంతో ఆ గ్రామ ప్రజలు అంతా మంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు.