కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని జీడిమెట్ల 132 డివిజన్ న్యూ వివేకానంద్ నగర్ కు చెందిన యువకులు బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారి సమక్షంలో చింతల్ లోని ఎమ్మెల్యే కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
ఈ మేరకు బీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన యువకులకు ఎమ్మెల్యే గారు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారి నాయకత్వంలో.. గౌరవ పురపాలక శాఖ మంత్రి శ్రీ కేటీఆర్ గారి సారధ్యంలో రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమంలో దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు.
పార్టీలో చేరిన యువకులు ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రజా ప్రతినిధులు, సీనియర్ నాయకులు మరియు పార్టీలో చేరిన కేమ శ్రీనివాస్ బృందం పాల్గొన్నారు.