దలకు మెరుగైన వైద్యం అందించాలనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలనుంచి పుట్టిందే తెలంగాణ డయాగ్నస్టిక్స్ హబ్ అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. వైద్య రంగం లో ముఖ్యమంత్రి కేసీఆర్ విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారని అన్నారు. కేసీఆర్ తీసుకున్న చర్యలతో వైద్యరంగం లో తెలంగాణ నెంబర్ వన్ గా నిలిచిందన్నారు.
చిన్నచిన్న పరీక్షలకు సైతం పల్లె ప్రాంతాల నుండి పట్టణాల నుండి ప్రైవేట్ డయాగ్నస్టిక్స్ సెంటర్లకు వెళ్లి డబ్బులు వృధా చేసుకాకుండా ప్రజలకు వైద్య సేవలను మరింత చేరువ చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకొచ్చిన ,టీ డయాగ్నస్టిక్స్ హబ్ సౌకర్యాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలి కోరారు. ఈ కేంద్రాలలో 134 వైద్య పరీక్షలు పూర్తిగా ఉచితంగా నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. ముఖ్యంగా ఇటీవల కాలంలో మహిళలు బ్రెస్ట్, సర్వైకల్ క్యాన్సర్ల వంటి బారిన పడుతుండటాన్ని గుర్తించిన ముఖ్యమంత్రి కేసీఆర్, క్యాన్సర్లను ముందుగా గుర్తించే మమోగ్రఫీ టెస్టులను కూడా తెలంగాణ డయాగ్నస్టిక్స్ హబ్ హబ్లో అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు.
ఏ చిన్న అనుమానం వచ్చిన మహిళా సోదరీమణులు తమ గ్రామాల్లో పట్టణాల్లో ఉండే ఆశా వర్కర్లను సంప్రదించి మమో గ్రఫీ స్క్రీనింగ్ టెస్ట్లను చేయించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఇటువంటి క్యాన్సర్లైన ముందుగా గుర్తిస్తే తగిన చికిత్స ద్వారా నివారించవచ్చన్న మంత్రి,, ప్రభుత్వం కల్పించిన ఈ సౌకర్యాన్ని జిల్లా వ్యాప్తంగా ప్రజలు ముఖ్యంగా మహిళ సోదరీమణులు వినియోగించుకోవాల్సిన కోరారు. పల్లె దవఖాన బస్తీ దవాఖాన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోని వైద్యులు వైద్య సిబ్బంది ప్రజాప్రతినిధులు తెలంగాణ డయాగ్నిసిక్ సేవలపై ప్రజలకు అవగాహన కల్పించాలని విజ్ఞప్తి చేశారు.