హైదరాబాద్ మాదాపూర్‌లోని స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో తెలంగాణ భాషా, సాంస్కృతిక శాఖ సహకారంతో నటుడు, ఫోటోగ్రాఫర్ సన్నీ పల్లె ఏర్పాటు చేసిన ”మైరైడ్ ఎమోషన్స్” ఫోటో ఎగ్జిబిషన్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించిన రాష్ట్ర చలనచిత్ర, టీవీ, థియేటర్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ. అనిల్ కుర్మాచలం గారు. అనంతరం ఆయన భాషా, సాంస్కృతి శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణతో కలిసి చిత్ర ప్రదర్శనను తిలకించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఫోటో వెనుక ఒక జ్ఞాపకం ఉంటుందని, అనుభూతి దాగుంటుందని, ఫోటోలు తీపిగుర్తులకు నిదర్శనమన్నారు. సన్నీ ఏర్పాటు చేసిన ఫోటోలు మనసును ఆకట్టుకునే విధంగా ఉంటాయన్నారు.
సన్నీ సినిమా నటుడిగానే కాకుండా ఫోటోగ్రఫీలో కూడా రాణించడం గొప్ప విషయమని, భవిష్యత్ లో కూడా సన్నీ తను ఎంచుకున్న రంగంలో విజయం సాధించాలని కోరుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో చిత్రకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో భాషా సాంస్కృతిక శాఖ వారిని ప్రోత్సహించడం అభినందనీయమని అన్నారు.ఈ కార్యక్రమంలో కవి గాయకుడు మిట్టపల్లి సురేందర్, దర్శకులు ఉదయ్ గుర్రాల, శేఖర్ గంగనమోని, సూర్యతేజ, నటుడు అజయ్ మంకెనపల్లి తదితరులు పాల్గొన్నారు.