హైదరాబాద్ లోని మంత్రి నివాసంలో పాలకుర్తి మండలానికి చెందిన 20 మంది యూత్ నాయకులు తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్,గ్రామీణాభివృద్ధి,గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు అమెరికా పర్యటనకు త్వరలో వెళ్ళనున్న సందర్భంగా వారిని మర్యాద పూర్వకంగా కలిసి ముందస్తుగా పుట్టిన రోజు (జులై 04) శుభాకాంక్షలు తెలిపి పుష్పగుచ్ఛం అందించారు.
అదేవిధంగా పాలకుర్తి మండల యూత్ కమిటీ గురించి కొద్దిసేపు మంత్రి తో మాట్లాడి మండల యూత్ అధ్యక్ష పదవి కేటాయింపుపై మండల కేంద్రంలోని చెన్నూర్ గ్రామానికి చెందిన దొంతమల్ల గణేష్ ని పాలకుర్తి మండల యూత్ అధ్యక్షుడుగా నియమించాలని కోరగా అందుకు మంత్రి సానుకూలంగా స్పందించారని యూత్ నాయకులు తెలిపారు.