తెలంగాణలో తాము అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదని తేల్చేశారు. అసలే అంతర్గత పోరు, వర్గ విభేదాలతో అతలాకుతలమైన రాష్ట్ర బీజేపీకి కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వ్యాఖ్యలు పుండుమీద కారం చల్లినట్టుగా మారాయి.
తాజాగా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నితిన్ గడ్కరీ మాట్లాడుతూ.. ‘తెలంగాణలో మేం బలపడతాం. ప్రధాన ప్రతిపక్ష స్థాయికి ఎదుగుతాం. అన్నీ అనుకూలిస్తే మరింత మంచి ఫలితాలు వస్తాయి’ అని పేర్కొన్నారు.
అంటే తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీ అధికారంలోకి రాదని గడ్కరీ తేల్చేశారు. రాష్ట్ర బీజేపీ నేతలకు అంత సీన్ లేదని పరోక్షంగా స్పష్టం చేశారు. నిజానికి నితిన్ గడ్కరీ కూడా వాస్తవ పరిస్థితులకన్నా అధికంగా ఊహించుకున్నారని విశ్లేషకులు అంటున్నారు. పార్టీకి రాష్ట్రంలో ఏమాత్రం ప్రజాదరణ లేదని, ఇటీవలి పరిణామాలు పార్టీని ప్రజల్లో మరింత చులకన చేశాయని చెప్తున్నారు.