బతుకమ్మ చీరల కోసం రాష్ట్ర ప్రభుత్వం 351.52 కోట్ల నిధులను విడుదల చేసింది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వం ప్రతి సంవత్సరం బతుకమ్మ పండుగను పురస్కరించుకొని రాష్ట్రంలోని నిరుపేద ఆడబిడ్డలకు చీరలను పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే.
18 ఏండ్లు నిండిన ప్రతి స్త్రీకి చీరలను పంపిణీ చేస్తుండగా, రాష్ట్రంలో సగటున ప్రతి సంవత్సరం కోటి మందికిపైగా ఆడబిడ్డలకు లబ్ధి చేకూరుతున్నది. అందుకు సంబంధించి ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్‌లో మొత్తంగా రూ.400 కోట్లను ప్రతిపాదించింది. ఆ నిధుల్లో రూ.351.52 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.