కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బాచుపల్లి సాయినగర్ దేవేందర్ నగర్ ఈద్గాలో ముస్లీంల పవిత్ర పండుగ బక్రీద్ (ఈద్- ఉల్- ఆదా)ను పురస్కరించుకొని ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనల్లో ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ముస్లీం సోదరులకు ఎమ్మెల్యే గారు బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. త్యాగానికి ప్రతీక బక్రీద్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక డిప్యూటీ మేయర్ దన్ రాజ్ యాదవ్, ఫ్లోర్ లీడర్ ఆగం పాండు, కార్పొరేటర్లు బాలాజీ నాయక్, సురేష్ రెడ్డి, విజయ లక్ష్మి వెంకట సుబ్బారావు, గాజుల సుజాత, కో-ఆప్షన్ మెంబర్ మరియు ఎన్ఎంసీ ముస్లీం మైనార్టీ చైర్మన్ సలీం, సీనియర్ నాయకులు కొలన్ గోపాల్ రెడ్డి, సునీల్ రెడ్డి, జగన్ యాదవ్, జగదీష్ యాదవ్, సాంబ శివారెడ్డి, స్వామి, మైనార్టీ జనరల్ సెక్రెటరీ ఎం.నబీ, ఫారుక్, జహంగీర్, మహ్మద్ అలీ, సయ్యద్ షకీల్, సకిర్, మహ్మద్ సలీం, పాషా, మున్నా, శర్బుద్దిన్ మరియు మైనార్టీ కార్యవర్గ సభ్యులు, పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.