త్యాగానికి ప్రతీకగా జరుపుకునే బక్రీద్ పర్వదినం సందర్భంగా ముస్లిం సోదరులకు అలంపూర్ శాసన సభ్యులు డాక్టర్.వి.యం.అబ్రహం గారు శుభాకాంక్షలు తెలిపారు.
గురువారం నాడు ఐజ మున్సిపాలిటీ లో ఉన్న ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేసిన తర్వాత ముస్లిం సోదరులకు ఎమ్మెల్యే గారు శుభాకాంక్షలు తెలియజేశారు. త్యాగాలకు ప్రతీకగా బక్రీద్ నిలుస్తుందని, మనకు కలిగిన ప్రయోజనాలను జనులందరికీ సమానంగా అందించినపుడే సార్థకత చేకూరుతుందనే సందేశాన్ని ఈ పండుగ ఇస్తుందని ఎమ్మెల్యే గారు తెలిపారు.
బక్రీద్ భక్తి, త్యాగం, కరుణ, విశ్వాసం అనే గొప్ప గుణాలను ప్రజల్లో పెంపొందిస్తుందని అన్నారు. అల్లా దయ ప్రజలందరిపై ఉండాలని, ప్రజలంతా సుఖశాంతులతో వర్థిల్లాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు మరియు BRS పార్టీ నాయకులు మరియు ముస్లిం మైనార్టీ నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు..