బీఆర్‌ఎస్‌ను తెలంగాణ పార్టీ అంటున్నారని.. కానీ బీఆర్‌ఎస్ భారతదేశ గతిని మార్చే, పరివర్తన తెచ్చే ఒక మిషన్ అని సీఎం కేసీఆర్ అన్నారు. ఇది జాతీయ స్థాయిలో పనిచేసే పార్టీ అని స్పష్టం చేశారు.
మహారాష్ట్రలోని సర్కోలి బహిరంగ సభలో ప్రసంగించిన సీఎం కేసీఆర్.. మన దేశానికి ఏదైనా లక్ష్యం ఉందా లేక మనం దారి తప్పి చీకట్లో మగ్గుతున్నామా? అని ప్రశ్నించారు.
ఈ విషయంపై ప్రజలు ఆలోచించాల్సిన అనివార్య సమయం వచ్చిందని తెలిపారు. తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలను దేశవ్యాప్తంగా ఎందుకు అమలు చేయలేకపోతున్నారని ప్రశ్నించారు. వీటితో పాటు పలు కీలక అంశాల గురించి సీఎం కేసీఆర్ మాట్లాడారు.