మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా మత్స్యకార సంఘం చైర్మన్ గా మన్నె రాజు గారు ఎన్నికైన సందర్భంగా ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారిని తన నివాసం వద్ద కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మన్నె రాజు గారిని శాలువాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ కొంపల్లి మున్సిపాలిటీ అధ్యక్షుడు, రంగారెడ్డి నగర్ డివిజన్ అధ్యక్షుడు, సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.