తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ గారు ఢిల్లీ చేరుకొని తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పలు పెండింగ్ అంశాలపై రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలిశారు. సమావేశం అనంతరం మాజీ ఎంపీ ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక అధికార ప్రతినిధి డా౹౹ మంద జగన్నాథ్ గారు, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బి.వినోద్ కుమార్ గారు, ఎంపీలు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు, రంజిత్ రెడ్డి గార్లతో కలిసి మీడియాతో సమావేశం నిర్వహించారు…
కేటీఆర్ గారి ప్రెస్ మీట్ – ఏమన్నారంటే…
🔹ఐటీ, ఏరో స్పేస్, డిఫెన్స్, ఫార్మా, లైఫ్ సైన్సెస్ ఇలా అన్ని రంగాల్లో అద్భుతమైన ప్రగతితో ముందుకు పోతున్న హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం కేంద్ర సహకరించాలని అనేకసార్లు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాం.
🔹కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ మంత్రి కేటీఆర్ గారు హాట్ కామెంట్స్ చేశారు. తొమ్మిదేళ్లలో హైదరాబాద్ నగరానికి కేంద్ర ప్రభుత్వం అందించిన సాయం గుండు సున్నా అని అన్నారు. హైదరాబాద్ లాంటి నగరంలో స్కై వేల నిర్మాణం కోసం అనేక సార్లు విజ్ఞప్తి చేశామని, రక్షణ శాఖ మంత్రులు మారుతున్నా, కానీ కేంద్ర ప్రభుత్వ వైఖరి మారడం లేదన్నారు. స్వయంగా సీఎం కేసీఆర్ గారు ప్రధాని మోదీని కలిసి విజ్ఞప్తి చేసినా ఎలాంటి స్పందన లేకపోయిందన్నారు…
🔹హైదరాబాద్‌లో ట్రాఫిక్ నిర్వహణకు చేపట్టిన ఎస్సార్డీపీలో భాగంగా తలపెట్టిన ఓఆర్‌ఆర్‌లు, స్కైవే లు మరియు లింకు రోడ్ల నిర్మాణం చెపట్టేందుకు భూములు ఇవ్వాలని రక్షణ శాఖకు అనేక సార్లు విజ్ఞప్తి చేశామని, మరోసారి ఈ విషయాన్ని రాజ్‌నాథ్ సింగ్ గారి దృష్టికి తీసుకెళ్లామని మంత్రి కేటీఆర్ గారు తెలిపారు..
🔹కంటోన్మెంట్లో నిరుపయోగంగా ఉన్న భూములను జీహెచ్ఎంసీకి ఇస్తే అక్కడ ప్రజలకు అవసరమైన ఆస్పత్రులు, కమ్యూనిటీ హాల్‌లను నిర్మాణం చేస్తామని కోరామన్నారు…