దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా చివరి రోజు అయిన తెలంగాణ అమరవీరుల సంస్మరణ దినోత్సవం ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఘనంగా నిర్వహించారు. హనుమకొండ లో రాష్ట్ర పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు గారు, రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్, ఎమ్మెల్యేలు ఆరూరి రమేష్, పెద్ది సుదర్శన్ రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి, జిల్లా కలెక్టర్లు సిక్తా పట్నాయక్, ప్రావీణ్య, సిపి రంగనాథ్ తదితరులతో కలిసి అదాలత్ సెంటర్ లో అమరవీరుల స్థూపం కు నివాళులు అర్పించి, తెలంగాణ గర్వించదగ్గ మహనీయులు కాళోజీ నారాయణరావు, ప్రొఫెసర్ జయశంకర్ సార్, కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.