Home / SLIDER / దేశానికి దిక్సూచిగా తెలంగాణ

దేశానికి దిక్సూచిగా తెలంగాణ

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకల్లో భాగంగా సత్తుపల్లి మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేష్ గారి అధ్యక్షతన పురపాలక సంఘం ఆధ్వర్యంలో అమరవీరుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య గారు హాజరయ్యారు. ఈ సందర్భంగా స్థానిక మున్సిపల్ కార్యాలయం నుండి రింగ్ సెంటర్ లోని అమరవీరుల స్థూపం వరకు కళాకారుల డప్పు దరువులతో, కళాబృందాల నృత్యాలతో, తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల వేషధారణలో చిన్నారులు, తెలంగాణ ఉద్యమ పాటలతో, ఉద్యమకారులతో ర్యాలీని నిర్వహించి అమరవీరుల స్థూపం వద్ద తెలంగాణ అమరవీరులకు ఘన నివాళులు అర్పించి మౌనం పాటించారు.

అనంతరం ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గారు సత్తుపల్లి నియోజకవర్గానికి చెందిన తెలంగాణ ఉద్యమకారులను శాలువాతో సత్కరించారు. ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య మాట్లాడుతూ దశాబ్ది వేడుకల్లో అమరవీరులను స్మరించుకోవడం గొప్ప అవకాశంగా భావిస్తున్నా అన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో అమరవీరులను స్మరించుకుంటూ, ఉద్యమ కారులను సత్కరించుకునే గొప్ప అవకాశం కల్పించిన సీ.ఎం కేసీఆర్ గారి కృతజతలు తెలిపారు. బి.ఆర్.ఎస్ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులను ఎన్నడు మర్చిపోదన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు అసువులు బాసిన అమరవీరుల త్యాగాలను, పోరాటాలకు చిహ్నంగా బి.ఆర్.యస్ ప్రభుత్వం హైదరాబాద్ నడిబొడ్డున అమరవీరుల స్థూపాన్ని ఆవిష్కరిస్తూ, వారికి దశాబ్ది వేడుకల సందర్భంగా ఘన నివాళులర్పిస్తుందని అన్నారు.

అమరవీరుల స్ఫూర్తితో ఏర్పడిన తెలంగాణ దేశానికి దిక్సూచిగా నిలిచిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్థ ఛైర్మన్ కొత్తూరు ఉమా మహేశ్వరరావు, మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేష్, ఆత్మ చైర్మన్ వనమా వాసు, పట్టణ బి.ఆర్.యస్ పార్టీ అధ్యక్షులు రఫీ, కార్యదర్శి అంకమరాజు, తదితర మున్సిపల్ కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు షేక్ అయ్యుబ్ పాషా, ఉద్యమ జె.ఏ.సి చైర్మన్ చిత్తులూరి ప్రసాద్, కన్వీనర్ కుకలకుంట రవి, సిపిఐ నాయకులు దండు ఆదినారాయణ, యెబూ, రామకృష్ణ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు మధుసూదన్ రాజు, ముత్యరత్నం, వెంకటేశ్వరరావు, అదిల్ షరీఫ్, నాగాచారి సీతారామయ్య, శరత్, రియాజుద్దీన్, ఉద్యమ ఉద్యోగ సంఘాల నాయకులు గార్ల రామకృష్ణ, సూర్యనారాయణ, కార్మిక సంఘాల నాయకులూ సుధాకర్, నాగరాజు, యుగేందర్, చింత కృష్ణ, తొలిదశ ఉద్యమ కారులు బొంతు వెంకటేశ్వరరావు, కంచర్ల బాబురావు, కృష్ణారెడ్డి, కవులు కళాకారులు బొమ్మారెడ్డి శ్రీనివాస రెడ్డి, పిల్లి మల్లిఖార్జున్, జాగృతి సాగర్ తదితరులున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat