భారతదేశానికి దారిచూపే ఒక దీపస్తంభంగా తెలంగాణను నిలుపుతామని మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ నడిబొడ్డున కొలువుదీరిన అమరుల స్మారకం.. జ్వలించే దీపం సాక్షిగా త్యాగధనులను ఎప్పుడూ గుండెల్లో పెట్టుకుంటామన్నారు.
నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల సేవలో పునరంకితం అవుతామన్నారు. అమరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని కేటీఆర్ ట్వీట్ చేశారు.“అమరుల ఆశయాలే స్ఫూర్తిగా దేశంలోనే రాష్ట్రాన్ని అగ్రగామిగా తీర్చిదిద్దాం.
తొమ్మిదేళ్ల ప్రగతి ప్రస్థానమే ఇందుకు నిదర్శనం. తెలంగాణ సమాజాన్ని కష్టాల కడలి నుంచి గట్టెక్కించగలిగాం. తొమ్మిదేళ్ల స్వల్పకాలంలోనే వచ్చే వందేళ్లకు బలమైన పునాది వేసి దేశానికే ఆదర్శంగా నిలిచాం” అని కేటీఆర్ ట్వీట్ చేశారు.