Home / SLIDER / అమ‌ర‌వీరుల‌ను అవ‌మానించే సంస్కృతి మాది కాదు

అమ‌ర‌వీరుల‌ను అవ‌మానించే సంస్కృతి మాది కాదు

తెలంగాణ అమ‌ర‌వీరుల‌ను అవ‌మానించే సంస్కృతి మాది కాదు.. పూజించే సంస్కృతి మాది అని భార‌త్ జాగృతి అధ్య‌క్షురాలు, ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత స్ప‌ష్టం చేశారు. అబిడ్స్‌లోని తెలంగాణ సార‌స్వ‌త ప‌రిష‌త్‌లో భార‌త జాగృతి ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన తెలంగాణ సాహిత్య స‌భ‌లో క‌విత పాల్గొని ప్ర‌సంగించారు.

తెలంగాణ చ‌రిత్ర‌లో ఇవాళ సువ‌ర్ణ అక్ష‌రాల‌తో లిఖించ‌ద‌గ్గ రోజు అని క‌విత అన్నారు. ట్యాంక్ బండ్ వ‌ద్ద ఏర్పాటు చేసిన అమ‌ర‌వీరుల స్థూపాన్ని ఆవిష్క‌రించుకుంటున్నామ‌ని చెప్పారు. ఇవాళ కొన్ని ప‌త్రిక‌లు స‌మైక్య రాష్ట్రంలో అవ‌లంభించిన విధానాలనే నేడు పాటిస్తున్నాయ‌ని మండిప‌డ్డారు. అమ‌రుల‌ను త‌ప్ప‌కుండా గౌర‌వించుకుంటామ‌న్నారు. మ‌న రాష్ట్రం గొప్ప రాష్ట్రం. మ‌న‌సున్న రాష్ట్రం అని పేర్కొన్నారు. ప్ర‌తి అంశాన్ని రాజ‌కీయం చేస్తున్న ప‌త్రిక‌ల మ‌న‌సు మారాల‌ని కోరుకుంటున్న‌ట్టు క‌విత తెలిపారు. ప్రతి క్షణం ప్రతి రోజు విషం చిమ్ముతునే ఉన్నాయ‌ని ధ్వ‌జ‌మెత్తారు. కొన్ని పత్రికలు ఇక్కడ జ్యోతులు కావు అని క‌విత విమ‌ర్శించారు.

తెలంగాణ సాహిత్యం మీద గంభీరమైన చర్చ జరగాలన్న ఉద్దేశంతో తెలంగాణ సాహిత్య సభలు ఏర్పాటు చేయడం జరిగింద‌ని క‌విత తెలిపారు. పిల్లల్లో భాష మీద మక్కువ పెరగాలి. బాల సాహిత్యం ప్రచురణ చేసి స్కూల్ లైబ్రరీలో అందించే ప్రయత్నం చేస్తామ‌న్నారు. తెలంగాణ చరిత్రను.. భారతదేశ వ్యాప్తంగా తెలియజేస్తాం. తెలంగాణలో బౌద్ధం, జైనం మీద బుక్స్ తీసుకువ‌స్తామ‌న్నారు. పాఠశాలల్లో పిల్లలకు సాహిత్య మీద పట్టు కోసం ప్రత్యేకంగా కార్యక్రమం తీసుకువ‌స్తామ‌ని ఎమ్మెల్సీ క‌విత‌ చెప్పారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat