తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ఈరోజు అమరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా బోథ్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన అమరులకు నివాళి కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా గౌరవ బోథ్ శాసన సభ్యులు రాథోడ్ బాపురావు గారు హాజరయ్యారు. ముందుగా అమరవీరుల స్థూపానికి నివాలులర్పించి బోథ్ నియోజకవర్గానికి చెందిన తెలంగాణ రాష్ట్రం కోసం అసురులు బాసిన అమరవీరుల కుటుంబాలకు మొమెంటో అందజేసి వారి కుటుంబ సభ్యులను సన్మానించారు.
అనంతరం అమర వీరుల స్థూపం నిర్మాణం కొరకు భూమి పూజ చేశారు. అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం వస్తేనే ఉద్యోగాలు వస్తాయని, తెలంగాణ రాష్ట్రం వస్తేనే నీళ్లు నిధులు నియామకాలు వస్తాయని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆనాడు ఉన్న పదవికి రాజీనామా చేసి 2001 లో ఒక్కడుగా బయలుదేరి యువతకు దిశానిర్దేశం చేసి తెలంగాణ రాష్ట్రం కోసం జనసంద్రంగా మార్చి 14 ఏండ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత అనేక యువత ప్రాణ త్యాగాల ఫలితమే నేటి ఈ బంగారు తెలంగాణ రాష్ట్రం అని అన్నారు.
వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని అమరవీరులకు జోహార్ తెలుపుతూ ముగించారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ నారాయణ రెడ్డి, జడ్పీటీసీ సంధ్యారాణి, ఎఎంసి చైర్మన్ రుక్మన్ సింగ్, వైస్ చైర్మన్ సంజీవ్ రెడ్డి, వైస్ ఎంపిపి లింబాజి, సర్పంచ్ సురేందర్, జడ్పీ కోఆప్షన్ సభ్యులు తాహెర్, ఎలుక రాజు, జగన్ రెడ్డి, పోశెట్టి, సోమన్న, రాయలు గార్లతో పాటు తదితరులు ఉన్నారు.