Home / SLIDER / స్వరాష్ట్రంలో అన్ని మతాలు, వర్గాలకు ప్రాధాన్యం

స్వరాష్ట్రంలో అన్ని మతాలు, వర్గాలకు ప్రాధాన్యం

స్వరాష్ట్రంలో అన్ని మతాలు, వర్గాలకు అధిక ప్రాధాన్యం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందని కోదాడ అభివృద్ధి ప్రదాత, శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ గారు అన్నారు. బుధవారం కోదాడ పట్టణంలోని ముస్లిం మత ప్రార్థనలు షాది ఖానాలో, క్రిస్టియన్ మైనార్టీ వారివి చర్చిలో నిర్వహించిన మత ప్రార్థనలకు ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ గారి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రార్థన కార్యక్రమంలో పాల్గొని అందరికీ తెలంగాణ ఆవిర్భావ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… స్వరాష్ట్రంలో అన్ని మతాలు, వర్గాలకు ప్రాధాన్యం లభిస్తున్నదని,సనాతన ధర్మ పరిరక్షకుడిగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంస్కృతీ సంప్రదాయాలకు పెద్దపీట వేశారన్నారు.

హిందూ, ముస్లిం, క్రిస్టియన్‌ అనే తేడా లేకుండా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. ఆలయాలను సరికొత్తగా తీర్చిదిద్దుతున్నారని తెలిపారు. మసీదులు, చర్చిలకు ఆధునిక హంగులద్దేందుకు నిధులు మంజూరు చేస్తున్నారని పేర్కొన్నారు. మౌలానాలు, పాస్టర్లకు అదే స్థాయిలో గౌరవ భృతి ఇస్తున్నారని తెలిపారు.విభిన్న మతాలు, భాషలు, రాష్ట్రాల ప్రజలు కలిసి జీవించే తెలంగాణలో గాంధీ జీ కలలు కన్న గంగా జమునా తెహజీబ్‌ సంస్కృతి శతాబ్దాలుగా విలసిల్లుతోందని, సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ దేశంలోనే అత్యంత అద్భుతంగా అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని ఆయన అన్నారు.అభివృద్ధి జరిగిన చోట ఉత్సవాలు నిర్వహించడం తెలంగాణ లో మినహా దేశం లో మరి ఎక్కడ లేదన్నారు. గత పాలకుల హయాం లో పండుగొచ్చినా ఎవరూ సాయం చేయలేదు.

ఆలయాలు, చర్చిలు, మసీదు పెద్దలను ఆదుకున్న దాఖలాలు లేవు. గత ప్రభుత్వాలన్నీ పండుగలన్నింటినీ చిన్నచూపు చూసినవే. తెలంగాణ సిద్ధించిన తర్వాత సీఎం కేసీఆర్‌.. ఆలయాలు, చర్చిలు, మసీదుల ప్రాముఖ్యతను, ప్రాధాన్యతను గుర్తించారు.మైనార్టీ వర్గాలకు చెందిన ప్రార్థనా మందిరాలు, పవిత్రబోధకుల సంక్షేమం విషయంలో గత ప్రభుత్వాలు పూర్తిగా నిర్లక్ష్యం చేశాయి. ఎన్నికల సమయంలో అన్ని రాజకీయ పార్టీలు అండగా నిలుస్తామని, బోధకుల సంక్షేమానికి వేతనాలు అందజేస్తామని వారిని ఓటు బ్యాంకు గా చూశాయి తప్పా ఏనాడూ ఒక్క రూపాయి ఇవ్వలేదన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్‌ చెప్పినట్లుగానే సహకరిస్తున్నారన్నారు. మైనార్టీలకు చెందిన ప్రార్థనా మందిరాల్లో వసతులు, ఇతర సౌకర్యాల కల్పనకు పెద్ద సంఖ్యలోనే నిధులు మంజూరు చేశారన్నారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు అల్తాఫ్ హుస్సేన్, నయీమ్, పట్టణ కౌన్సిలర్లు షఫీ, మదర్, ఖదీర్, ఫాతిమా ఖాజ, ముస్లిం మత పెద్దలు, కో ఆప్షన్ సభ్యులు జానకి యేసయ్య, బిఆర్ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat