తెలంగాణ కోసం జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు జయశంకర్ సార్ అని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నీళ్లు నిధులు నియామకాలు సార్ కల అని, సీఎం కేసీఆర్ ఆ కలను నిజం చేసి చూపించారని ప్రశంసించారు.
నిర్మల్ పట్టణంలో ఆచార్య జయశంకర్ సార్ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… జయశంకర్ సార్ తెలంగాణే ఊపిరిగా శ్వాస ఉన్నంత వరకు తెలంగాణ కోసం ఉద్యమించారని ఆయన సేవలను స్మరించుకున్నారు. . తెలంగాణ ఉద్యమ నిర్మాణంలో కేసీఆర్‌కు వెన్నంటి ఉండి రాష్ట్ర సాధనలో భాగస్వాములయ్యారని కొనియాడారు.