తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు పునర్ వైభవం తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా నూతనంగా 2143 ఆలయాలలో దూప దీప నైవేద్యం పథకం అమలు చేయడానికి ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఈ ఆలయాలన్నింటికీ ప్రతినెల ధూప దీప నైవేద్యం పథకం కింద పూజా కార్యక్రమాల కొరకు 6000 రూపాయలు అందజేస్తారు.
ఈ ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం మెదక్ జిల్లాలోని 93 ఆలయాలు, మెదక్ నియోజకవర్గం లోని 49 ఆలయాలకు లబ్ధి చేకూరనుంది. ఈ సందర్భంగా మెదక్ నియోజకవర్గంలోని 49 ఆలయాలను ధూప దీప నైవేద్యం పథకం కింద మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.